కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్తో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకునేందుకు మాతృభూమి ఫౌండేషన్ ముందుకొచ్చింది.
పేదలకు మాతృభూమి ఆపన్నహస్తం - mathrubhumi distributed groceries to needy in vikarabad
కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సాయం చేసేందుకు కొన్నిచోట్ల దాతలు ముందుకొస్తున్నారు.

పేదలకు మాతృభూమి ఆపన్నహస్తం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మంలం అంతారం గ్రామంలో ఈ ఫౌండేషన్ తరఫున.. ఇంఛార్జ్ ఎంవీ బుగ్గయ్య పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగ్గుల కృష్ణ, ఉప సర్పంచ్ గోపాల్, అఖిల భారత అంబేడ్కర్ యువజన సంఘం వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డమీది వెంకట్ రాములు పాల్గొన్నారు.