తెలంగాణ

telangana

ETV Bharat / state

వరకట్న వేధింపులతో విహహిత ఆత్మహత్య - dowry harassment in Vikarabad district

వికారాబాద్​ జిల్లా ధారూర్​ మండలం దోర్నాల్​లో దారుణం చోటుచేసుకుంది. అత్తింటి వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Married Women suicide for dowry harassment in Vikarabad district
వరకట్న వేధింపులతో విహహిత ఆత్మహత్య

By

Published : May 3, 2020, 3:03 PM IST

వికారాబాద్​ జిల్లా ధారూర్‌ మండలం దోర్నాల్‌ తండాకు చెందిన శాంతిబాయి, మోహన్‌లకు ముగ్గురు సంతానం. పెద్దకూతురు రోజాను నాగారం తండాకు చెందిన సంతోష్‌కు ఇచ్చి గతేడాది ఏప్రిల్‌లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రెండు లక్షల రూపాయలు, ఆరు తులాల బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి ఇచ్చారు.

ఆరు నెలల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. తర్వాత నుంచి అత్త, మామ, భర్త అదనపు కట్నం తీసుకురావాలని రోజాను వేధించడం మొదలుపెట్టారు. దీనివల్ల తీవ్ర మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్నేహవర్ష తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details