వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో సుమారు 150 కోట్ల రూపాయలతో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అనంతగిరి హిల్స్‌లో నటుడు మంచు మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తిని చూపుతున్నారని చెప్పారు.
Ananthagiri Adventure: అనంతగిరి హిల్స్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టు
వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో రూ.150 కోట్లతో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నటుడు మంచు మనోజ్ కుమార్ ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆసక్తి చూపారని ఆయన వెల్లడించారు.
అనంతగిరి హిల్స్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టు
ప్రాజెక్టు ప్రతిపాదనలను మంచు మనోజ్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక రూపొందించాలని టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్న మంత్రి దీని ద్వారా సుమారు 500 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఇదీ చూడండి: