వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని మైహిష గిరి కొండ శివ నామస్మరణతో మార్మోగింది. శివానంద గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. 41 రోజుల పాటు నిష్టగా మాలాధారణ చేసి నిర్వహించే ఈ మహా పడి పూజకు శివ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి పారవశ్యంలో శివ స్వాములు, భక్తులు మునిగిపోయారు. పూజని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల మైహిష గిరి కొండ కిక్కిరిసిపోయింది.
శివ నామస్మరణతో మార్మోగిన మైహిష గిరి కొండ - శివ నామస్మరణతో మార్మోగిన మైహిష గిరి కొండ
భక్తి పారవశ్యంలో శివ స్వాములు మహా పడి పూజ నిర్వహించారు. ఓం నమ శివాయ అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు.

శివ భక్తులతో కిక్కిరిసిన మైహిష గిరి కొండ