మహాశివరాత్రి సందర్భంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చౌడపూర్ గ్రామంలోని ఓంకారేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు - sivaratri celebrations in vikarabad dist
మహాశివరాత్రి సందర్భంగా వికారాబాద్ జిల్లా చౌడపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో చిన్నారులు ఆహుతులను కట్టిపడేశారు.

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు
గ్రామీణ ప్రాంత చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేయడం చాలా గొప్ప విషయమని గ్రామ సర్పంచ్ కితాబిచ్చారు. పిల్లలకు విద్యతో పాటు సాంస్కృతిక నృత్యాలు నేర్పిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు
ఇవీ చూడండి:పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు!