వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రూప్ఖాన్పేట గేటు సమీపంలో సిమెంట్ లారీ పూర్తిగా దగ్ధమైంది. ఏపీ 15టీసీ 0378 నంబర్ గల సిమెంట్ లారీ సేడంలోని వాసవదత్త నుంచి సిమెంట్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తొన్న ఈ లారీ... ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి.. పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. లారీ బ్యాటరీ పేలి మంటలు చెలరేగి వాహనం మొత్తం వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. అప్పటికే లారీ మొత్తం పూర్తిగా కాలిపోయింది.
'బ్యాటరీ పేలి పూర్తిగా దగ్ధమైన సిమెంట్ లారీ' - lorry fire accident in vikarabad
సిమెంట్ లోడ్‌తో వెళ్తొన్న లారీ... ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం బ్యాటరీ పేలి మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది.
'బ్యాటరీ పేలి పూర్తిగా దగ్ధమైన సిమెంట్ లారీ'