వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజపూర్ రహదారిపై నిలబడ్డ లారీని బైకు ఢీకొనటం వల్ల మహమ్మద్ జావేద్ అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చి బైకుపై తిరిగి వెళ్తుండగా దామరగిద్ద స్టేజ్ వద్ద లారీని ఢీకొట్టాడు.
లారీ- బైక్ ఢీ... వ్యక్తి మృతి - దామరగిద్ద వద్ద రోడ్డు ప్రమాదం
వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద వద్ద విషాదం చోటుచేసుకుంది. రహదారిపై నిలబడ్డ లారీని బైక్ ఢీకొనటం వల్ల జావేద్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
లారీ- బైక్ ఢీ...
ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావటం వల్ల చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.