తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టిగణేశ్​లను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం - lectuerers

రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకై వికారాబాద్​ జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాలకు ప్రణాళికులు రూపొందించమన్నారు. స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులను మమేకం చేస్తూ.. మట్టి వినాయకుల తయారీతోపాటు, అవగాహనను కల్పిస్తున్నారు. ​

మట్టిగణేశ్​లను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

By

Published : Jul 31, 2019, 8:27 PM IST

పర్యావరణ పరిరక్షణ కోసం వికారాబాద్​ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్​ ఖానమ్​​ మట్టి వినాయకుల తయారీ శిక్షణతోపాటు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ ప్రణాళికలు రూపొందించమన్నారు. శాలివాహన కులస్థుల సహాయంతో పలు చోట్లు తయారీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేసి వారికి కూడా అవగాహన కార్యక్రమాలతోపాటు తయారీ విధానం నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్ గణేశ్ విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నందున... హానికర రసాయనాలు నీటిలో విడుదలై .. జీవజలానికి ముప్పు వాటిల్లుతోందని అభిప్రాయపడ్డారు.

మట్టిగణేశ్​లను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

ABOUT THE AUTHOR

...view details