Leopard Commotion: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మక్తవెంకటాపూర్లో చిరుత కలకలంరేపుతోంది. గ్రామంలోకి చొరబడిన చిరుత... లేగదూడపై దాడి చేసి చంపేసింది. రైతు కేతావత్ మెగ్యానాయక్... రోజులాగే పశువులను పొలం దగ్గర కట్టేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా... లేగదూడ రక్తపు మడుగులో పడి ఉంది. చిరుత దాడి చేసిందని రైతు వాపోయాడు.
Leopard Commotion:'మక్తవెంకటాపూర్లో చిరుత కలకలం' - Leopard Commotion at maktavenkatapur
Leopard Commotion: వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మక్తవెంకటాపూర్లో తాజాగా ఓ లేగదూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
కుల్కచర్ల, చౌడపూర్ మండల గ్రామాల్లో చిరుతపులి గతంలో ఇలాగే ఎన్నో పశువులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నెల క్రితం కూడా... చిరుతదాడిలో ఓ పశువు మృతి చెందిందన్నారు. ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోలేకపోయారు. కనీసం పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదని గ్రామస్థులు వాపోయారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:పెన్షన్ కోసం లింగ మార్పిడి- వృద్ధుడి ప్లాన్ తెలిసి అధికారుల మైండ్ బ్లాంక్!