తెలంగాణ

telangana

ETV Bharat / state

వామ్మో చిరుత... రాంపూర్​లో కంటిమీద కునుకు కరవు!

చిరుత హడలెత్తిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పశువులపై విరుచుకు పడుతోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే.. రాంపూర్ ప్రజలకు వణుకు పుడుతోంది.

By

Published : Aug 30, 2019, 8:46 PM IST

చిరుతను బంధించి కష్టాలు తొలగించండి

చిరుతను బంధించి కష్టాలు తొలగించండి
వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండలం రాంపూర్ సమీపంలోని అడవి ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. పొలాల దగ్గర ఉన్న పశువులపై దాడి చేసి చంపేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐదారుసార్లు దాడి చేసిందని, అటవీ అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దీనితో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తాము, చిరుత భయం వల్ల ఇళ్లల్లో నుంచి బయటకు రాలేకపోతున్నామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చిరుతను బంధించి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details