తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్టాండ్ ముందు లెక్చరర్ల ఆందోళన - వికారాబాద్ జిల్లా పరిగి తాజా వార్తలు

పరిగి బస్టాండ్ ముందు లెక్చరర్లు ఆందోళన నిర్వహించారు. ఇన్ని రోజులు మూల్యాంకన కేంద్రాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు వేసి.. ఇప్పుడు ఆ బస్సులను రద్దు చేయడం వల్ల ఆ కేంద్రాలకు ఆలస్యంగా వెలుతున్నామని నిరసన వ్యక్తం చేశారు.

lecturer-dharna-at-pargi-bus-stand
బస్టాండ్ ముందు లెక్చరర్ల ఆందోళన

By

Published : May 20, 2020, 1:23 PM IST

ఇంటర్ పేపర్ మూల్యాంకనం కోసం గత వారం రోజులుగా వారికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం బస్సులు ప్రారంభం కావడం వల్ల వాటిలోని వెళ్లాలని సూచించారు. దాంతో సుమారు 100 మంది లెక్చరర్లు సమయానికి చేరుకోలేకపోతున్నామని వికారాబాద్ జిల్లా పరిగి బస్​డిపో వద్ద ఆందోళన చేశారు.

తమకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మూల్యంకనానికి వెళ్లబోమని నిరసన చేపట్టారు. మూల్యాంకనం చేసే సరికి సాయంత్రం 6 నుంచి 7 అవుతుంది. ఆ సమయంలో మాములు బస్సులు అందుబాటులో ఉండవని వారు చెబుతున్నారు. మేము అనేక ఇబ్బందులు పడాల్సివస్తుందని అంటున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేటు వాహనాల్లో వెళితే రూ. 60 వరకు ఖర్చవుతుందని అన్నారు. ఇక మాకు మిగిలేందటని వాపోతున్నారు.

ఇదీ చూడండి :27 రకాల పురుగుమందులపై వేటు

ABOUT THE AUTHOR

...view details