వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. 32 గ్రామ పంచాయతీలకు ఒక్కటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండటం వల్ల రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. సరైన సౌకర్యాలు లేక మంగళవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన వారిలో 72 మందికే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసే సమయానికి కరెంటు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మిగతా వారికి తరువాత క్యాంపులో ఆపరేషన్లు చేస్తామని వైద్యులు తెలిపారు. అధికారులు స్పందించి... మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
కుల్కచర్లలో కు.ని. ఆపరేషన్లు చేయకుండా వెనక్కు పంపారు - kulkacharla
కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. చివరకు కుటంబం నియంత్రణ ఆపరేషన్కోసం గ్రామానికి ఒకరు చొప్పున ఎంపిక చేసే దుస్థితి ఏర్పడింది.
kulkacharla