నలభై ఏళ్ల కింద నాయనమ్మ చెప్పిన గరీబీ హఠావో... నినాదాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారని ఎద్దేవా చేశారు తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పాలమూరు ఆపాలంటూ కేసులు పెట్టిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు... కేసీఆర్ ఆ పథకాన్ని పూర్తిచేయలేదంటూ ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి... పాలమూరు పథకానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్ - RAHUL
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే రాహుల్ గాంధీకి, భాజపా అభ్యర్థులు గెలిస్తే నరేంద్ర మోదీకి లాభమని అదే గులాబీ సైనికులు గెలిస్తే తెలంగాణ గడ్డకి లాభమని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.
![నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2854467-813-f86d5d78-34b9-435a-9c74-276e35e28e17.jpg)
నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్
నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్