తెలంగాణ

telangana

ETV Bharat / state

కిడ్నీ బాధితుడికి కేఎస్ఆర్ ట్రస్ట్ ఆపన్నహస్తం - రెండు కిడ్నీలు పాడైపోయిన వ్యక్తిని ఆదుకున్న కెఎస్ఆర్ ట్రస్ట్

వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండల కేంద్రానికి చెందిన మంగలి రఘు హైబీపీతో చికిత్స పొందుతున్న సమయంలో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. నిరుపేద కుటుంబంలో పుట్టిన రఘుకు వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం కేఎస్​ఆర్ ట్రస్ట్ ఆపన్నహస్తం అందించింది.

రెండు కిడ్నీలు పాడైపోయిన వ్యక్తిని ఆదుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్
రెండు కిడ్నీలు పాడైపోయిన వ్యక్తిని ఆదుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్

By

Published : Sep 17, 2020, 11:16 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండల కేంద్రానికి చెందిన మంగలి రఘు హైబీపీతో చికిత్స పొందుతున్న సమయంలో రెండు కిడ్నీలు పాడయ్యాయి. నిరుపేద నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రఘు కుల వృత్తి హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

రెండు కిడ్నీలు పాడయ్యాయి..

అన్ని పరీక్షలు చేసిన వైద్యులు బాధితుడి రెండు కిడ్నీలు పాడైపోయాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తప్పనిసరిగా కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుడికి అంత స్థోమత లేకపోవడం వల్ల ఇంటి దగ్గరే కాలం వెల్లదీస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న కేఎస్​ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ రఘుకు ఆర్థిక సహాయం అందించింది. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు వెంకట్ రెడ్డి. రామకృష్ణారెడ్డి, శ్రీశైలం. తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details