తెలంగాణ

telangana

ETV Bharat / state

కేఎస్​ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ - కేఎస్​ఆర్ ట్రస్ట్ నిత్యావసరాలు పంపిణీ

కేఎస్​ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా సంజీవ్​నగర్​లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆ ట్రస్ట్ అధినేత శరత్ రెడ్డి వారికి 25 కేజీల బియ్యంతో పాటు సరుకులు అందజేశారు.

KSR Trust Distribution of essentials at sanjeev nagar vikarabad
కేఎస్​ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

By

Published : Jun 15, 2020, 9:27 AM IST

వికారాబాద్ జిల్లా సంజీవ్​నగర్​లో నిరుపేదలకు కేఎస్​ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరకులు అందజేశారు. కేఎస్​ఆర్ ట్రస్టు అధినేత శరత్ రెడ్డి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈనెలలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా గ్రామంలోని అందరిని హోమ్ క్వారంటైన్ చేశారు.

కరోనా ప్రభావంతో ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు రాకుండా ఉండటం వల్ల జీవనోపాధి కరువై దాతల కోసం చూస్తున్నారు. దాతలు సహాయం చేయాలని సోషల్ మీడియాలో సర్పంచ్ అశోక్ రెడ్డి కోరగా ఆయన స్పందించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు సైతం నిత్యావసరాలు, కొంత నగదును అందజేశారు.

ఇదీ చూడండి :'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం.. 50 వేల మందికి పరీక్షలు'

ABOUT THE AUTHOR

...view details