వికారాబాద్ జిల్లా దోమ మండలం లింగన్పల్లిలో హోం క్వారంటైన్లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు కేఎస్ఆర్ ట్రస్ట్ అధినేత శరత్ రెడ్డి. కరోనా కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రాలేక సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
క్వారంటైన్ కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందజేత - వికారాబాద్ జిల్లా లింగన్పల్లిలో నిత్యావసర సరుకుల అందజేత
క్వారంటైన్ బాధితులకు కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు.
క్వారంటైన్ కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందజేత
బియ్యం, పప్పు, నూనె, కూరగాయలతోపాటు మరిన్ని సరకులను పంపిణీ చేసిసనట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్, జనగం వెంకట్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!