తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండేళ్లలో కొడంగల్ రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి - కౌన్సిలర్లు, అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమై... కాలనీల్లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, క్రైస్తవులకు చీరలు పంపిణీ చేశారు.

kodangal mla patnam mahendar reddy meet with counselors and officers
రెండేళ్లలో కొడంగల్ రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి

By

Published : Dec 23, 2020, 3:08 PM IST

వచ్చే రెండు సంవత్సరాలలో కొడంగల్ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్ పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులతో సమావేశమై... అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొడంగల్​కు కేటాయించిన 15 కోట్లతో పాటు పట్టణ ప్రగతిలో భాగంగా... వచ్చిన రెండున్నర కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పనులు వారం రోజుల్లోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులను తాను చేసి చూపిస్తానని... కాలనీల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు... క్రైస్తవ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, కౌన్సిలర్లు, సర్పంచ్​లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details