జూన్ చివరి నాటికి వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని అన్ని కాలనీలకు మిషన్ భగీరథ నీటిని అందించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలోని కార్గిల్ కాలనీలో మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా ప్రారంభించారు. ఇప్పటికే మిషన్ భగీరథ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల కాలేకపోయాయని అన్నారు. వెంటనే పనులు వేగవంతం చేసి జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మిషన్ భగీరథ నీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే - మిషన్ భగీరథ
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని కార్గిల్ కాలనీలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీటిని ప్రారంభించారు. జూన్ చివరి నాటికి పట్టణంలోని అన్ని కాలనీలకు నీటిని అందించాలని అధికారులకు సూచించారు.
మిషన్ భగీరథ నీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
అనంతరం పోలీసు స్టేషన్ ఆవరణలో కేటీఆర్ పిలుపు మేరకు కుండీలలో ఉన్న చెత్తను తొలగించారు. కుండీలలో ఉన్న మురుగు నీటిని పారబోశారు. తర్వాత మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ కమిషనర్ వినయ్‌కుమార్. సీఐ నాగేశ్వరరావు, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి : గుత్తా