తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కొడంగల్ శాసనసభ్యుడు - undefined

నారాయణ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలోని కోస్గీ మండలంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా సామాజిక దూరం పాటిస్తూ అధికారులకు సహకరించి ధాన్యాన్ని తూకం వేయించు కోవాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

kodangal-mla-inaugurates-paddy-procurement-center
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కొడంగల్ శాసనసభ్యుడు

By

Published : Apr 9, 2020, 2:59 PM IST

Updated : Apr 9, 2020, 6:18 PM IST

కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గీ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద సామాజిక దూరం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా గుంపులు గుంపులుగా ఉండకుండా అధికారులకు సహకరించి ధాన్యాన్ని తూకం వేయించుకోవాలని తెలిపారు.

కరోనా నేపథ్యంలో ప్రజలు ఎవరూ పనులు చేసుకునే పరిస్థితి లేదని అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ బియ్యం డబ్బులు పంపిణీ చేస్తోందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో రేషన్ కార్డు లేని వారిని సైతం గుర్తించి పేద ప్రజలకు నిత్యావసరాలు, నగదు సాయం అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధం లోనే ఉండాలని తెలిపారు.

Last Updated : Apr 9, 2020, 6:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details