వికారాబాద్ జిల్లా పరిగిలోని అమరవీరుల చౌరాస్తాలో జర్నలిస్టులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కరోనాతో మరణించిన జర్నలిస్ట్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. కరోనా కట్టడిలో జర్నలిస్ట్ పాత్ర చాలా గొప్పదని... ప్రభుత్వం బాధితుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జర్నలిస్ట్‌లు డిమాండ్ చేశారు.
పరిగిలో జర్నలిస్టుల కొవ్వొత్తుల ర్యాలీ - జర్నలిస్టుల కొవ్వొత్తుల ర్యాలీ
కరోనాతో మరణించిన జర్నలిస్ట్ ఆత్మకు శాంతి చేకూరాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఫొటోకు నివాళులర్పించారు.
![పరిగిలో జర్నలిస్టుల కొవ్వొత్తుల ర్యాలీ journalists protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7553076-56-7553076-1591766994011.jpg)
పరిగిలో జర్నలిస్టుల కొవ్వొత్తుల ర్యాలీ
తెలంగాణలో ఉన్న ప్రతి జర్నలిస్ట్‌కు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఖర్చుతో 50 లక్షల బీమా చేయించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్