గురువారం విడుదలైన ఇంటర్ పలితాల్లో ఫెయిల్ అయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం భజ్యా నాయక్ గిరిజన తండాకు చెందిన విస్లావత్ హన్మనాయక్, లక్ష్మీల కూతురు విస్లావత్ నిఖిత (17) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని తెలుసుకున్న నిఖిత మనస్తాపానికి గురైంది. అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంటర్ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా భజ్యా నాయక్ గిరిజన తండాకు చెందిన విస్లావత్ నిఖిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫెయిలైనందుకు మనస్తాపంతో అర్థరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇంటర్ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య
ఉదయాన్నే లేచిన తండ్రి హన్మనాయక్... తన కూతురు నిఖితను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైనందుకే మృతి చెందినట్లు తండ్రి హన్మనాయక్ తెలిపారు.
ఇవీ చూడండి: ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి బలవన్మరణం