ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు వికారాబాద్ జిల్లా తాండూరులో వినూత్న నిరసన తెలిపారు. తమ పిల్లలతో కలిసి మహిళా కార్మికులు దీక్షకు పూనుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి వేతనాలు అందకపోవటం వల్ల దసరా పండుగ జరుపుకోలేదని, ఇప్పుడు దీపావళి పండుగ సైతం జరుపుకోలేకపోతున్నామని కార్మికులు భిక్షాటన చేపట్టారు. తమ పిల్లలతో సైతం భిక్షాటన చేయించి వినూత్నంగా నిరసన చేశారు. రోడ్డుపై వచ్చే వాహనదారులు, వ్యాపార దుకాణాలలో భిక్షాటన కొనసాగించారు.
పిల్లలతో కలిసి ఆర్టీసీ కార్మికుల భిక్షాటన - ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు వికారాబాద్ జిల్లా తాండూరులో వినూత్న నిరసన తెలిపారు
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికి 22వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా వినూత్నంగా తమ పిల్లలతో కలిసి మహిళా కార్మికులు దీక్షకు పూనుకున్నారు.
పిల్లలతో కలిసి ఆర్టీసీ కార్మికుల భిక్షాటన
తెజాస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం తాండూరు వచ్చే కార్యక్రమం రద్దయింది. హైదరాబాద్ నుంచే ఆయన ఫోన్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికులకు అండగా ఉంటామని, తప్పక న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : అర గుండు.. సగం మీసంతో కార్మికుల నిరసన