తెలంగాణ

telangana

ETV Bharat / state

"స్వీయ నియంత్రణ పాటిస్తూ.. మత సామరస్యాన్ని కాపాడాలి" - వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో రంజాన్ పర్వదినం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులంతా స్వీయ క్రమశిక్షణను పాటిస్తూ.. మత సామరస్యాన్ని కాపాడాలని మాజీ డిసిఎంఎస్ ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి సూచించారు. రంజాన్‌ పర్వదినాన్ని ఇంటికే పరిమితమై జరుపుకోవాలని కోరారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో పేద ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

in-the-center-of-the-kulkacharla-mandal-in-vikarabad-district-the-needy-muslims-have-been-educated
"స్వీయ నియంత్రణ పాటిస్తూ.. మత సామరస్యాన్ని కాపాడాలి"

By

Published : May 25, 2020, 7:39 AM IST

రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు మాజీ డిసిఎంఎస్ ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో .. భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించారు.

గత 25 ఏళ్ల నుంచి అన్ని పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకునేవాళ్లమని భీమ్ రెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఈసారి కేవలం నిత్యవసర సరకులు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిపారు. ముస్లిం సోదరులందరు మాస్కులు ధరించి శుభాకాకంక్షలు తెలుపుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:నేడు ఈద్‌ ఉల్‌ ఫితర్‌

ABOUT THE AUTHOR

...view details