వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని పాత తాండూర్ నుంచి బొలెరో వాహనంలో 38 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎండీ ఆసీఫ్, ఎండీ ఫారుఖ్ తరలిస్తున్నారు.
38 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - ration rice Seized in Tandoor, Vikarabad district
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పక్కదారి పడుతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న 38 బస్తాల బియ్యాన్ని వికారాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
38 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాలను తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.