చేవెళ్ల లోక్సభపరిధిలోని పరిగి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెరాస అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తన తల్లిపై ప్రమాణం చేశారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలో నిర్వహించినకార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సీఎం ప్రవేశపెట్టినపథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చాయని వెల్లడించారు.అందుకే కేసీఆర్ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కేంద్రానికి సానుకూలంగా ఉన్న రాష్ట్రాలకే నిధులు మంజూరు చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే 16 స్థానాలు గెలవాలని అన్నారు. తననిభారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.
గెలిపిస్తే పరిగిని అభివృద్ధి చేస్తా: రంజిత్ రెడ్డి - DOMA MANDAL
నా తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నన్ను గెలిపించండి.. ఎమ్మెల్యేతో కలిసి తప్పకుండా పరిగిని అభివృద్ధి బాట పట్టిస్తా ---- చేవేళ్ల లోక్సభ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి
కేంద్రానికి సానుకూలంగా ఉన్న రాష్ట్రాలకే నిధులు మంజూరు చేస్తున్నారు : రంజిత్ రెడ్డి