వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. కాపురానికి రావటంలేదనే కోపంతో ఓ వ్యక్తి.... తన భార్య, ఆమె తండ్రిని కిరాతకంగా హత్యచేశాడు. బాలపేట గ్రామానికి చెందిన గపూర్‌సాబ్ కుమార్తె హజీబేగంకు హైదరాబాద్‌కు చెందిన ఖలీద్‌తో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో... హజీబేగం గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటుంది.
కాపురానికి రానందుకు భార్య, మామను చంపిన భర్త - క్రైమ్ వార్తలు
పెళ్లి అనంతరం వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ మూడ్రోజుల క్రితం ఇంటికి రావాలంటూ భర్త ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె నిరాకరించే సరికి కోపోద్రిక్తుడైన భర్త... భార్యను, ఆమె తండ్రిని కిరాతకంగా చంపేశాడు. ఈ దుర్ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త
మూడ్రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన ఖలీద్ కాపురానికి రావాలని కోరగా... ఆమె నిరాకరించింది. ఆవేశానికి గురైన ఖలీద్... నువ్వు ఇంకెవరితోనే సంబంధం పెట్టుకున్నావంటూ కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన మామ గపూర్‌సాబ్‌తో పాటు... భార్య హజీబేగంను విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ ఘటనలో తండ్రికూతురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
ఇవీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నేడు బంద్
Last Updated : Jun 9, 2020, 2:27 PM IST