తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆందోళనకరంగా కల్తీ కల్లు బాధితుల పరిస్థితి - telangana varthalu

వికారాబాద్​ జిల్లాలో వారం రోజులుగా కల్తీ కల్లు తాగి వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కల్లు కావాలంటూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే అధికారులు నమూనాలు సేకరించి దుకాణాలు సీజ్‌ చేశారు.

ఆందోళనకరంగా కల్తీ కల్లు బాధితుల పరిస్థితి
ఆందోళనకరంగా కల్తీ కల్లు బాధితుల పరిస్థితి

By

Published : Jan 14, 2021, 11:35 AM IST

వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఇప్పటికే చాలామంది చికిత్స తీసుకున్నప్పటికీ... వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్లు కావాలంటూ తలలు బాదుకుంటున్నారు. కల్లు తాగి వందల మంది ఆస్పత్రి పాలవ్వగా.. ఇద్దరు మృతి చెందారు.

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామాల్లోని కల్లు డిపోల్లో నుంచి నమూనాలు సేకరించారు. రెండు దుకాణాలు సీజ్‌ చేశారు. ఇప్పటివరకు సేకరించిన నమూనాల ఫలితాలు రాలేదని వెల్లడించారు.

ఆందోళనకరంగా కల్తీ కల్లు బాధితుల పరిస్థితి

ఇదీ చదవండి: 354 మందిని ఆస్పత్రిపాలు చేసిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details