తెలంగాణ

telangana

ETV Bharat / state

తాండూర్​లో నిమజ్జనానికి భారీ బందోబస్తు - వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా తాండూర్​లో వినాయక నిమజ్జనం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

నిమజ్జనానికి అందరూ సహకరించాలి : జిల్లా ఎస్పీ

By

Published : Sep 5, 2019, 12:09 PM IST

వికారాబాద్ జిల్లా తాండూర్​లో జరగనున్న వినాయక నిమజ్జనానికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. బందోబస్తును పర్యవేక్షించడానికి బుధవారం తాండూర్ వచ్చిన ఎస్పీ జిల్లాలో మొత్తం 2700 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. తాండూర్ లోనే 814 విగ్రహాలు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలోనే తాండూర్​కు ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు.

పోలీస్ బలగాలను సైతం పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డీజేకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవన్నారు. ఇతర మతాలను కించ పరిచే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని సూచించారు.

నిమజ్జనానికి అందరూ సహకరించాలి : జిల్లా ఎస్పీ

ఇవీ చూడండి : గవర్నర్‌ పదవి వచ్చినా... సాధారణ మహిళనే: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details