కొవిడ్ టెస్టు ఇప్పుడో ఓ పరీక్ష. పొద్దున్నే లేవగానే ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ర్యాపిడ్ కిట్ల కొరత ఒక సమస్య అయితే మరో పక్క ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వైరస్ లేనివారికి సైతం మహమ్మారి సోకేలా ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. భౌతికదూరం మరిచిపోయి ఒకరి మీద ఒకరు ఎగబడుతున్నారు. రెండు రోజులుగా ర్యాపిడ్ కిట్లు లేకపోవడంతో వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో జనాలు బారులు తీరారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు తీవ్రమైన పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
కొవిడ్ టెస్టు కేంద్రాలా... లేక ప్రసాదం పంపిణీ కౌంటర్లా?
కొవిడ్ టెస్టుల కోసం ప్రజల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉదయం నుంచే ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీరా అక్కడ చూస్తే వైరస్ను మనమే కొని తెచ్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు కిట్ల కొరత మరోవైపు వైద్య సిబ్బంది నిర్వాకంతో ప్రజలు భౌతికదూరం విస్మరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి దీనికి అద్దం పడుతోంది.
పరిగి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గూమిగుడిన ప్రజలు
వైద్య సిబ్బంది నిర్వాకం
కొందరు ఆసుపత్రి సిబ్బంది ర్యాపిడ్ కిట్లను రూ.50 నుంచి 100కు అమ్ముకుంటుంన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కరోనా టెస్టు కేంద్రాల వద్ద నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని సూచిస్తున్నారు. మరికొందరు అక్కడ పరిస్థితిని చూసి వెనుతిరిగి వెళ్లిపోయారు.