కరోనా కారణంగా.. దాదాపు ఏడాది తరువాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన తితిదే.. వ్యాక్సినేషన్ కొనసాగుతుండటంతో దశలవారీగా టోకెన్లను పెంచుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ 50,200 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,621 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3 కోట్ల 11 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారమూ ఇదే రద్దీ కొనసాగే అవకాశముంది.
వీఐపీ దర్శన సమయంలో..