వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో శుక్రవారం కురిసిన వర్షాలకు చెరువులు నిండి అలుగులు పారుతూ.. పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు నుంచి హైదరాబాద్, మహబూబ్నగర్, జహీరాబాద్లకు వెళ్లే దారిలో వాగులు పొంగడం వల్ల రోడ్లు పాడై.. రాకపోకలు నిలిచిపోయాయి.
వికారాబాద్ జిల్లాలో భారీవర్షం.. నీట మునిగిన పంటలు - నిలిచిపోయిన రాకపోకలు
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు నీట మునగడం వల్ల పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరి.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో ఆగని వర్షం.. నీట మునిగిన పంటలు
జుంటుపల్లి, శివసాగర్ జలాశయాలు నిండి అలుగు పారుతున్నాయి. మంబాపూర్, మన్సాన్పల్లి , కోకట్ వాగులతో పాటు తాండూరు సమీపంలో కాగ్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాల్లోకి నీరు చేరి.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో పంటలు మునిగి నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.