తెలంగాణ

telangana

ETV Bharat / state

నీళ్లల్లో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి - vikarabad district updates

వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలుకు పరిగిలో బీసీ కాలనీలోని వీధుల్లోకి నీళ్లు చేరాయి. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. నీళ్లల్లో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

heavy rains in  vikarabad district
నీళ్లల్లో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి

By

Published : Jul 15, 2020, 1:23 PM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం కురవడంతో పరిగి పట్టణంలోని బీసీ కాలనీ వీధుల్లోకి నీళ్లు నదిలా ప్రవహిస్తోంది. బీసీ కాలనీలోని పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. బీసీ కాలనీల్లో నీళ్లు ప్రవహించడం ఇది మూడవసారి. ఇందులో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. మున్సిపల్ అధికారులకు ఈ విషయం తెలిసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మళ్లి కాలనిల్లోకి నీళ్లు రాకుండా చూడాలని కోరుతున్నారు. పరిగిలోని రాకపోకలు నిలిచిపోయాయి. నీళ్లల్లో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

ఇదీ చూడండీ: జూరాల గేట్లు ఎత్తిన అధికారులు... శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

ABOUT THE AUTHOR

...view details