వికారాబాద్ జిల్లా తాండూర్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ఆదివారం 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం ధాటికి హైదరాబాద్ తాండూర్ ప్రధాన రహదారి పూర్తిగా జలమయం అయ్యి వాగును తలపించింది.
కాలువను తలపించిన తాండూరు రోడ్డు - latest news of vikarabad
వికారాబాద్ జిల్లా తాండూర్లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి తాండూర్ రోడ్లు ధ్వంసం అయ్యాయి.
![కాలువను తలపించిన తాండూరు రోడ్డు heavy rain in vikarabad tandoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7815235-971-7815235-1593416143572.jpg)
కాలువను తలపించిన తాండూరు రోడ్డు
రోడ్డుమీద పెద్ద ఎత్తున వాన నీరు నిలిచి ఉండడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాన నీరు కారణంగా పట్టణంలోని అంతర్గత రోడ్లు నిండి.. మురికి కాలువలు పొంగి పొర్లాయి. దీనితో ప్రజాజీవనానికి తీవ్ర ఆటకం ఏర్పడింది.
ఇదీ చదవండి:హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!