వికారాబాద్ జిల్లా తాండూరులో ఉదయం నుంచే భారీగా వర్షం కురుస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. కాగ్నానది, కోకట్ వాగు వరద నీటితో నిండి పొంగిపొర్లుతున్నాయి.
వర్షం కారణంగా థరూర్ మండలం, పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి రోడ్డు మార్గాలు తెగిపోయాయి. దీంతో హైదరాబాద్కు వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. తాండూర్ నుంచి కొడంగల్ మీదుగా హైదరాబాద్కు రాకపోకలు కొనసాగిస్తున్నారు.