తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం - వికారాబాద్​ జిల్లాలో వర్షం వార్తలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ ఆగిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది.

heavy rain in vikarabad district Stopped traffic
భారీ వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు

By

Published : Sep 19, 2020, 12:45 PM IST

భారీ వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జిల్లాలో కోట్​పల్లి, సర్పన్ పల్లి, లక్నాపూర్, శివసాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి.

కొన్ని చోట్ల కల్వర్టులు కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. జిల్లాలోని అనేక గ్రామాలకు రాకపోకలు రద్దయ్యాయి. వాగులు పొంగుతుండడం వల్ల పంట పొలాల్లోని నీరు చేరడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలాంటి ప్రమాదాలు జరిగకుండా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు పోలీసులు వాగుల వెంట గస్తీ నిర్వహించారు.

ఇదీ చూడండి :దంచికొట్టిన వానలు.. పలుచోట్ల తెగిన కుంటలు, రోడ్లు

ABOUT THE AUTHOR

...view details