తెలంగాణ

telangana

ETV Bharat / state

Friends Help: దీనస్థితిలో ఆ కుటుంబం.. అండగా నిలిచిన వాట్సాప్​ గ్రూప్​ - దీనస్థితిలో ఆ కుటుంబం.. అండగా నిలిచిన వాట్సాప్​ గ్రూప్​

‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’..అనేలా మైత్రి బంధం అన్ని కాలాల్లో మరిచిపోలేని మధురానుభూతిగానే మారుతోంది. దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి... స్నేహితులు అండగా (friends help) నిలిచారు. అసలు ఏం జరిగిందంటే?

friends-help
friends-help

By

Published : Aug 16, 2021, 1:24 PM IST

వాట్సాప్​ ఓ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. స్నేహితులను (friends help) ఏకం చేసి.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆ కుటుంబానికి భరోసానిచ్చింది.

ఇదీ జరిగింది..

వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన మైపాల్ హైదరాబాద్​లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. భార్య గర్భవతి. ఒక కుమార్తె ఉంది. సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబంలో.. రోడ్డు ప్రమాదం దీనస్థితికి తీసుకువచ్చింది.

రోడ్డున పడేసిన ప్రమాదం

గర్భవతి అయిన తన భార్యతో పాటు కుమార్తెతో కలిసి హైదరాబాద్​ నుంచి తన మిత్రుడి కారులో తన స్వగ్రామానికి బయలుదేరాడు. సంతోషంగా బయలుదేరారు. కానీ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దామరగిద్ద వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని... మహిపాల్ ప్రయాణిస్తున్న కారుపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో మహిపాల్​ కాలు విరిగిపోయింది. గర్భవతిగా ఉన్న అతని భార్య భుజం ఎముక విరిగింది. అంతే కాకుండా గర్భస్రావం కూడా జరిగింది. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ క్రమంలో వీరిద్దరి చికిత్స నిమిత్తం దాదాపు ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల బెడ్​ రెస్టుకు అంకితం అయ్యాడు మహిపాల్. కుటుంబం గడవడం కష్టతరమైంది.

ఆసరాగా నిలిచిన వాట్సాప్​గ్రూప్

ఆ కుటుంబ దీనస్థితిని చూసి స్నేహితులు చలించిపోయారు. ఏదైనా సహాయం చేయాలి అని అంతా అనుకున్నారు. అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఓ స్నేహితుడు తమ గ్రామ వాట్సాప్​ గ్రూపులో మహిపాల్ పరిస్థితిపై ఓ పోస్ట్ పెట్టాడు. స్పందించిన అతని మిత్రులు, గ్రామ యువకులు డబ్బులు జమ చేశారు. మహిపాల్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా మహిపాల్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. దీనిపై గ్రామస్థులు వారిని మెచ్చుకుంటున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details