తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలీసు ఉద్యోగార్థుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం' - Vikarabad district latest news

పోలీసు ఉద్యోగంపై ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించేందుకు ఐదుగురు యువకులు నడుం బిగించారు. ఉద్యోగాలు పొందే విధంగా వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలోని ప్రభుత్వ పాఠశాలలో అర్హత పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షను పరిగి సీఐ లక్ష్మీ రెడ్డి పరిశీలించారు.

Free training program for police personnel in Vikarabad district
'పోలీసు ఉద్యోగార్థుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం'

By

Published : Feb 28, 2021, 4:57 PM IST

పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువత ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని... వికారాబాద్​ జిల్లా పరిగి సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షను ఆయన పరిశీలించారు. ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగులకు 2 ఏళ్లుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఐదుగురు యువకులను సీఐ అభినందించారు.

'పోలీసు ఉద్యోగార్థుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం'

2018లో దాదాపు 130 మంది యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు సంతోశ్​ తెలిపారు. వారిలో 30 మంది కానిస్టేబుల్​, ఎస్సైలుగా ఉద్యోగం సాధించారని అన్నారు. ఈ ఏడాది కూడా 300 మందికి శిక్షణ ఇచ్చేందుకు పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. తనతో పాటు నలుగురు మిత్రులు కలిసి ఉచితంగా శిక్షణ ఇస్తూ సమాజ హితం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. సందడిగా ఆలయ పరిసరాలు

ABOUT THE AUTHOR

...view details