అనారోగ్యంతో ఉన్న కొడుకు వైద్యం కోసం అప్పులు చేసి, ఆర్థికంగా చితికి... వికారాబాద్ దోమ లింగాన్పల్లికి చెందిన కొండని సాయన్న(56) అనే రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
'వికారాబాద్ జిల్లాలో ఉరేసుకుని రైతు బలవన్మరణం' - Vikarabad Lingampalli Former Sucide
వికారాబాద్ జిల్లా దోమ మండలం లింగాన్పల్లిలో ఓ రైతు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యల వల్లే ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు చెప్పారు.
Former_Sucide
సాయన్నకు ఇద్దరు కుమారులుండగా... రెండో కొడుకైన ఆంజనేయులు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతని వైద్యం కోసం దాదాపు రూ. 6లక్షల దాకా అప్పు చేసి వైద్యం చేయించినా... ఆరోగ్యం మెరుగవక పోవడం వల్ల మనస్తాపానికి గురైన సాయన్న బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని... అతని కుమారుడి చికిత్స కోసం ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరుతున్నారు.
ఇదీ చూడండి :గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు.. కోహెడకు తరలింపు