వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరాస్తాలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫాగింగ్ మిషన్లను ప్రారంభించారు. జేకేఎంఆర్, ప్రోగ్రెసింగ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు హైపో క్లోరైడ్ రసాయన ద్రావణ యాంత్రాలతో పట్టణంలో పిచికారీ చేయించారు. ఒక యంత్రం వికారాబాద్‌లోనే ఉంటుందని మిగితా ఐదు మిషన్లు వేరే ప్రాంతాలకు పంపించనున్నట్లు తెలిపారు.
'పార్టీలకతీతంగా ప్రభుత్వాలకు మద్దతు పలకాలి'
పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు మద్దతు పలకాల్సిన సమయం వచ్చిందని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కరోనా నివారణ కోసం ఫాగింగ్ మిషన్లను ప్రారంభించారు.
ఫాగింగ్ మిషిన్లను ప్రారంభించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కౌన్సిలర్లు అందరూ తమ తమ వార్డుల్లో పిచికారీ చేయించుకోవాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ ప్రభుత్వాలకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు