వికారాబాద్ జిల్లాలో మాజీమంత్రి చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వరినాట్లు వేశారు. రాంజేంద్రనగర్లోని వరి విత్తన సంస్థ నుంచి తెచ్చిన తెలంగాణ సోనా రకాన్ని నాటారు. పూర్తి సేంద్రీయ పద్ధతిలో పంట పండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ సోనాతో లాభాల పంట: మాజీమంత్రి చంద్రశేఖర్ - Former minister Chandrasekhar planted paddy with his family
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన తెలంగాణ సోనాలాంటి వరి రకాన్ని రైతులు విత్తుకుని మంచి దిగుబడి సాధించాలని మాజీమంత్రి చంద్రశేఖర్ సూచించారు. వికారాబాద్లో తన వ్యవసాయక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి వరి నాట్లు వేశారు.

తెలంగాణ సోనా.. మధుమేహుల ఖానా
ఈ వరి రకంలో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండటం వల్ల టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అర్జించవచ్చునని పేర్కొన్నారు. అన్నదాతలు కూడా ఈ రకం వగడంను విత్తుకోవాలని సూచించారు.
TAGGED:
తెలంగాణ సోనా.. మధుమేహుల ఖానా