తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్ జిల్లాలో ముంచెత్తిన వరద - వికారాబాద్​ జిల్లా వార్తలు

రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో గురువారం వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి పలు గ్రామాలు నీటమునిగాయి. నదులు, వాగులు నీటితో పొంగిపోర్లుతున్నాయి.

floods in vikarabad district
వికారాబాద్ జిల్లాలో ముంచెత్తిన వరద

By

Published : Jul 23, 2020, 5:57 PM IST

వికారాబాద్​ జిల్లాలోని తాండూర్ మండలం మల్రెడ్డిపల్లి, మల్కాపూర్, పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామాలల్లో భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వరద నీరు పెద్దఎత్తున చేరి... వీధులు జలమయంగా మారాయి. అంతర్గత రోడ్లు కాల్వలను తలపించాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో గ్రామస్థులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

పంటను కూడా వరద ముంచెంది. కంది, మినుము, పెసర నీట మునిగాయి. వాగులు పొంగిపొర్లడం వల్ల పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అత్యధికంగా మోమిన్​పేట్​లో 93.4 మిల్లీమీటర్లు, వికారాబాద్​ 24.2, పెద్దేముల్ 60, తాండూర్ 32.4, బంట్వారం 40, నవాబ్​పేట్ 22.8, మర్పల్లి 17.2, బషీరాబాద్​లో 24.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది

వికారాబాద్ జిల్లాలో ముంచెత్తిన వరద

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details