మత్స్యకారుల అభివృద్ధికి కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ తరఫున కృషి చేస్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలో.. మత్స్యకార సంఘాలకు ఉచితంగా బోట్లను పంపిణీ చేశారు.
మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. వారికి మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలని సూచించారు.
ప్రాజెక్టులలో బోటింగ్ ఏర్పాటు చేయడంవల్ల.. ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని కొండా పేర్కొన్నారు. ఫలితంగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధుయాష్కీ, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ ఎంపీపీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కృష్ణాబోర్డును విశాఖకు తరలించేందుకు రంగం సిద్ధం