వికారాబాద్ జిల్లా పరిగి అగ్నిమాపక కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఫైర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అశోక్ గౌడ్ (36) విధులు నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడం వల్ల హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించే లోపే గుండెపోటుతో మృతి చెందాడు. ఫైర్ కానిస్టేబుల్ అశోక్ గౌడ్ స్వస్థలం గండీడ్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన వాడు. అశోక్ గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుండెపోటుతో అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ మృతి - fire constable
విధి నిర్వహణలో ఉన్న ఫైర్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది.
![గుండెపోటుతో అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ మృతి fire constable died due to heart attack in vikarabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7796918-839-7796918-1593266368595.jpg)
గుండెపోటుతో అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ మృతి