రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాల్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా నిర్వహించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి: కృష్ణయ్య - వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో నుంచి తొలగించిన ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లను బేషరతుగా విధుల్లోకి తిరిగి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న నిరసనకు ఆయన మద్దతిచ్చారు.
![ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి: కృష్ణయ్య ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి: కృష్ణయ్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8971294-273-8971294-1601297561018.jpg)
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి: కృష్ణయ్య
ఫీల్డ్ అసిస్టెంట్లు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని.. వారి పోరాటం ఉద్ధృతం కాకముందే సీఎం కేసీఆర్ స్పందించాలని... వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ ఆందోళన న్యాయమైందని... వారి వెనకాల తానుంటానని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి:ఆ రెండు గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించాలంటూ ధర్నా