వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, ధారూరు, నవాబుపేట, మర్పల్లి, మోమిన్‌పేట, పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు, యాలాల, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో పదివేల మందికిపైగా రైతులు సుమారు 20వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలను సాగు చేస్తున్నారు. వీరు పండించిన ఉత్పత్తులను జిల్లాలోని ప్రధాన పట్టణాలైన తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్‌లో జరిగే సంతల్లో విక్రయిస్తుంటారు.
వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లోని రైతులు ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు తరలిస్తారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉండగా అందుకు ప్రోత్సాహం అందడం లేదు. జిల్లాలో 2వేలకుపైగా ఎకరాల్లో ఉల్లి పండించే రైతులు ఉండగా వీరికి ఏటా 33, 50 శాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేసేవారు. మూడేళ్లుగా వీటిని ఇవ్వడంలేదు.
కూరగాయల సాగును విస్తరించేందుకు కొంతమంది రైతులకు ఉచితంగా విత్తన పొట్లాలను అందించే వారు. వాటి జాడలేకుండా పోవడం వల్ల గత్యంతరంలేక బహిరంగ విపణిలో కొనక తప్పడం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రారంభించిన యాంత్రీకరణ పథకానికి అరకొర నిధులతో సరిపెడుతుండటంతో రైతులు పాతపద్ధతుల్లోనే ముందుకు సాగుతున్నారు.
ఐదుగురు ఉద్యోగులు... పద్దెనిమిది మండలాలు...