తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.' - తెలంగాణ వార్తలు

ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి చేయలేదని రైతులు రోడ్డెక్కారు. వాననీటిలో ధాన్యం తడిసి ముద్దవుతోందని వాపోయారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

farmers protest, grai purchases
రైతుల ధర్నా, ధాన్యం కొనుగోళ్లపై రైతుల ధర్నా

By

Published : Jun 6, 2021, 6:45 AM IST

వర్షాలు పడుతున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయలేదని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పెద్దేముల్ మండలం ఘాజీపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్, తాండూరు పట్టణ సమీపంలోని రైస్ మిల్లుల ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, సీపీఎం ధర్నాకు మద్దతు పలికాయి. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక ధాన్యం వాననీటిలో తడిసి ముద్దవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పోలీసులు రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ససేమిరా అనడం వల్ల ఉన్నతాధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

ఇదీ చదవండి:Harish rao: 'ప్రాణమున్నంత వరకు కేసీఆర్​ మాట జవదాటను'

ABOUT THE AUTHOR

...view details