వారం రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిపేశారంటూ రైతులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. సంచులు లేవని, లారీలు లేవని కొనుగోలు కేంద్రం సిబ్బంది కుంటిసాకులు చెబుతున్నారని రైతులు ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా - ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా
వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సంచులు, లారీలు లేవంటూ సిబ్బంది ధాన్యం కొనుగోలు నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిగి వార్తలు
వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వర్షమొస్తే పంట మొత్తం తడిసిపోతుందని.. పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.