తెలంగాణ

telangana

ETV Bharat / state

వడగండ్ల వాన.. రైతుల విలవిల - వడగండ్ల వర్షం.. రైతుల విలవిల

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీనివల్ల పలు చోట్ల రేకుల షెడ్లు, చెట్లు కూలిపోయాయి. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Farmers have been badly affected by rain in Vikarabad district
వడగండ్ల వర్షం.. రైతుల విలవిల

By

Published : May 3, 2020, 12:01 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి, కుల్కచర్ల మండలాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. అకాలవర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొంతమంది రైతులు వరిపంట కోయకముందే ఈ వర్షం రావటం వల్ల పొలంలోనే వరి గింజలు నేలరాలాయి. దీనివల్ల అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులకు మామిడి తోటల్లో కాయలన్నీ నేలమట్టం రాలాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details