తెలంగాణ

telangana

Farmers: SI కాళ్లు పట్టుకున్న కర్షకులు ... అన్నం పెట్టే అన్నదాత ఆక్రందన

By

Published : Jun 7, 2021, 1:30 PM IST

Updated : Jun 7, 2021, 3:00 PM IST

పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించి 15 రోజులు గడుస్తున్నా.. మిల్లర్లు ధ్యాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు.

Farmers setting fire to grain in vikarabad ditsrict
వికారాబాద్ జిల్లాలో పంటకు నిప్పుుపెట్టిన రైతులు

వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి.. నిప్పుపెట్టి నిరసన తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గన్నీబ్యాగ్‌లు ఇవ్వడం దగ్గర్నుంచి.. డబ్బులు చేతికందే వరకు దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

పదిహేను రోజుల క్రితం పంటను తెచ్చి కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా ఉంచామని రైతులు తెలిపారు. అకాల వర్షాలకు వరి ధాన్యం తడిచి మొలకెత్తుతోందని తాము తీవ్రంగా నష్టపోతామని గోడు వెల్లబోసుకున్నారు. పోలీసులు ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేయగా.. ఓ రైతు ఎస్సై కాళ్లపై పడి రోదిస్తూ.. ఆదుకోవాలని వేడుకోవడం అందరి మనసులను కదిలించింది.

వికారాబాద్ జిల్లాలో పంటకు నిప్పుుపెట్టిన రైతులు


ఇదీ చదవండి:Gang War: యువ‌కుల గ్యాంగ్​వార్​... సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు

Last Updated : Jun 7, 2021, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details