తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుదాఘాతంతో రైతు మృతి

పొలంలోని బోరు పనిచేయడం లేదని... స్టార్టర్​ను పరిశీలిస్తుండగా విద్యుత్ సరఫరా జరిగి ఓ రైతు మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

By

Published : Jul 21, 2019, 8:48 PM IST

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మోమిన్ కలాన్​కు చెందిన ఓ రైతు విద్యాదాఘాతంతో మరణించాడు. గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం పొలానికి వెళ్లిన ఆయన బోరు మోటర్ వేస్తే పనిచేయలేదు. స్టార్టర్​లోని వైర్లను పరిశీలిస్తుండగా... విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details